![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -412 లో.. ఆదర్శ్ కి అసలు విషయం చెప్పలేదన్న డిస్సపాయింట్ లో కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అసలు ఆదర్శ్ చెప్పనివ్వలేదు. పైగా ముకుంద కూడా మమ్మల్ని చూస్తుందని మురారి చెప్తాడు. ఇప్పుడు ఆదర్శ్ అంటే ఇష్టం లేదని ముకుంద తనకి చెప్తుందని కృష్ణ టెన్షన్ పడుతుంది. నేను వెళ్లి ఆదర్శ్ కి శోభనం వాయిదా వేద్దామని చెప్తానని మురారికి కృష్ణ చెప్తుంది.
ఆ తర్వాత ముకుంద వెళ్లి తన ఫ్రెండ్ గీతిక పంపించిన కొరియర్ తీసుకుంటుంది. అది ఎవరు చూడకుండా లోపలికి వస్తుంటే.. కృష్ణకి డాష్ ఇవ్వడంతో కొరియర్ కిందపడుతుంది. దాంతో కృష్ణ ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే రేవతి వచ్చి.. ఏంటని అడుగుతుంది. ఇద్దరం చూసుకోకుండా డాష్ ఇచ్చుకున్నామని ముకుంద అంటుంది. ఈ కవర్ ఏంటని రేవతి అడుగుతుంది. నేల్ పోలిష్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నానంటు ముకుంద లోపలికి వెళ్తుంది.. ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి కృష్ణ వెళ్తుంది. మరొకవైపు ముకుంద తన ఫ్రెండ్ పంపించిన పౌడర్ డబ్బాని మురారి చూడకుండా.. మురారి, కృష్ణల గదిలోకి వెళ్లి అక్కడున్న పౌడర్ డబ్బా తీసుకొని ముకుంద దగ్గరుంది పెట్టి.. ఆ తర్వాత తన ఫ్రెండ్ గీతిక శోభనం ఆపడానికి చేసిన ప్లాన్ గుర్తుకు తెచ్చుకుంటుంది. నేను పంపిస్తున్న పౌడర్ కృష్ణ గనుక రాసుకుంటే కృష్ణకి దద్దర్లు పుట్టి రాత్రంతా గోకుతూనే ఉంటుంది. దాంతో శోభనం క్యాన్సిల్ అవుతుంది. ముహూర్తం బాలేదని నువు కూడా శోభనం ఆపేయచ్చని గీతిక చెప్పిన విషయం ముకుంద గుర్తుకుచేసుకుంటుంది.
ఆ తర్వాత ముకుంద గదిలో ఉండగానే మురారి లోపలికి వెళ్లి.. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్లున్నావ్.. పౌడర్ డబ్బా చేంజ్ చేసినట్లున్నావ్.. శోభనం ఆపడానికే కదా.. ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఎలా మరి అంటూ ముకుందపై మురారి కోప్పడతాడు. నీ మనసు మార్చుకోమని మురారి అంటాడు. అసలు రాజీ పడేదే లేదని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి కృష్ వెళ్లి శోభనం వాయిదా వేద్దామని చెపుదామని అనుకుంటుంది కానీ ఆదర్శ్ చెప్పనివ్వడు. మరొకవైపు ముకుందని శోభనం కోసం రేవతి వచ్చి రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |